Monday, October 28, 2024

ఆట మొద‌ల‌యింది – 84రోజులు – 17మంది క‌టెస్టెంట్లు

నో కామ‌, నో ఫుల్ స్టాఫ్ అంటూ హంగామా చేస్తున్నారు హీరో నాగార్జున‌..డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 24గంట‌లు లైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఏం జ‌ర‌గ‌నుందో చూడొచ్చు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుని అందుకే పెట్టారు. బిగ్ బాస్ ఓటీటీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. 17 మంది కంటెస్టెంట్ల‌ను రెండు గ్రూపుల‌గా విడ‌దీశారు. అందులో కొంద‌రు వారియ‌ర్స్.. మరికొంద‌రు చాలెంజ‌ర్స్. వారియ‌ర్స్ అంటే ఇప్ప‌టికే పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5 సీజ‌న్ల‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్లలో కొంద‌రిని బిగ్ బాస్ ఓటీటీ కోసం తీసుకున్నారు. చాలెంజ‌ర్స్ అంటే కొత్త కంటెస్టెంట్లు. వారియ‌ర్స్‌గా బ‌రిలోకి దిగిన కంటెస్టెంట్లు 9 మంది. వాళ్లు అషు రెడ్డి, మ‌హేశ్ విట్ట‌, ముమైత్ ఖాన్‌, అరియానా గ్లోరీ, న‌ట‌రాజ్ మాస్ట‌ర్, తేజస్వియ మ‌దివాడ‌, స‌ర‌యు, హ‌మిద‌, అఖిల్. ఇక మిగిలిన 8 మంది ఛాలెంజ‌ర్స్ అజ‌య్ క‌థుర్వార్‌, స్ర‌వంతి చొకార‌పు, ఆర్‌జే చైతూ, శ్రీరాప‌క‌, అనిల్ రాథోడ్‌, మిత్రా శ‌ర్మ‌, యాంక‌ర్ శివ‌, బిందు మాధ‌వి. ఈ 17 మంది కంటెస్టెంట్లులో రెండు గ్రూపులు. ఈ రెండు గ్రూపుల‌లో ఏ గ్రూప్ విజ‌యం సాధిస్తుంది. 84 రోజుల వ‌ర‌కు ఎంత‌మంది ఉంటారు. చివ‌రికి క‌ప్ ఎవ‌రి చేతుల్లోకి వెళ్తుంది.. అనేది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement