నేటి స్టాక్ మార్కెట్లు బుధవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ప్రారంభంలో బ్రాడర్ మార్కెట్లు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 23,427.30 వద్ద ట్రేడైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పెరిగి 26,472.09 స్థాయిలలో కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభమైన గంట తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ 0.41 శాతం వద్దకు పెరిగి 55,497.53 వద్ద ట్రేడైంది. సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లుగా లార్సెన్స్ అండ్ టుబ్రో, సన్ ఫార్మాస్యూటికల్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు ఉన్నాయి. అయితే బజాజ్ ఫిన్‌సర్వ్, కొటక్ మహింద్రా బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు టాప్ లూజర్లుగా మార్కెట్లను కిందకి లాగాయి.
నిఫ్టీ 50 ఇండెక్స్ 0.35 శాతం పెరిగి 16,541.35 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా లార్సెన్ అండ్ టుబ్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మాస్యూటికల్స్ లాభాలు పండిస్తుండగా.. బజాజ్ ఫిన్‌సర్వ్, కొటక్ మహింద్రా బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నష్టాలలో మార్కెట్లను కిందకి లాగుతున్నాయి. లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు లాభపడటంతో బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ రంగం 2 శాతానికి పైగా లాభపడింది. ఈ ఇండెక్స్‌తో పాటు మిగిలిన రంగాల సూచీలు కూడా ఇదే దిశలో కొనసాగాయి. ఆర్ఎంసీ స్విచ్‌గేర్స్ లిమిటెడ్, హార్డ్‌క్యాసిల్, మార్కెట్ క్రియేటర్స్ లిమిటెడ్ స్టాక్స్ కూడా బీఎస్ఈలో టాప్ గెయినర్లలో చోటు దక్కించుకున్నాయి.