ఆస్కార్ కి సొంతంగా నామినేషన్లు పంపేందుకు యత్నిస్తోంది ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్.ఈ మేరకు బెస్ట్ హీరో కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పేర్లు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కాదని గుజరాతీ సినిమా చెల్లో షోని అస్కార్ కి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ఎంట్రీగా ప్రకటించింది.దీంతో దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలను ప్రారంభించింది. బెస్ట్ మోషన్ పిక్చర్..బెస్ట్ డైరెక్టర్ – రాజమౌళి..బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..బెస్ట్ యాక్టర్ : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్..బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్ ..బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్..బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్..బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు..బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్..బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి..బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి..బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్..బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు.
బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే..బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్. ఈ మేరకు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఆస్కార్ కి సొంతంగా నామినేషన్లు పంపనున్న- ఆర్ఆర్ఆర్ యూనిట్
Advertisement
తాజా వార్తలు
Advertisement