క్రేజీ మల్టీస్టారర్, పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ఓ తెలుగు డైరెక్టర్ తీసిన మూవీ బాలివుడ్లో సంచలనాలు రేపడంతో అంతా దీని గురించే చర్చించుకున్నారు. ఈ మూవీకి కచ్చితంగా ఆస్కార్ పురస్కారం దక్కుతుందని అనుకున్నారు. కానీ, ఆస్కార్‌లోనూ నిలుస్తుందనుకున్న వారి ఆశలపై గుజరాతీలు దెబ్బకొట్టారు. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది.
తాజాగా ప్రకటించిన భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఎంపికైంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. 2021 అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు.