Friday, November 22, 2024

హెల్త్ సిటీగా ఓరుగ‌ల్లు.. సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ నిర్మాణానికి నిదులు..

ప్రభన్యూస్‌ : చారిత్రాత్మక ఓరుగల్లు నగరం వైద్య, ఆరోగ్య రంగంలో ప్రపంచస్తాయి నగరంగా ఎదగనుంది. ఇక పేదలకు .. సాధారణ వైద్య సేవలు మొదలు సూపర్‌ స్పెషాలిటా వైద్య సేవలైన గుండె, కిడ్నీ, క్యాన్సర్‌ సంబంధిత వైద్యం కూడా ఉచితంగానే అందనుంది. వరంగల్‌ను హెల్త్‌ సిటీగా అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్‌ కల సాకారం కానుంది. పేదలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో తేవాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఈ జిల్లాలో కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హెల్త్‌ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్‌ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సివిల్‌ వర్క్స్‌కి రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్‌, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్‌ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్ల, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.22.18 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. వెంటనే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, డీఎంఈ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని జీవోలో ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement