Tuesday, November 26, 2024

Kerala | హాస్పిటల్స్​ని హై సెక్యూరిటీ జోన్​లు ప్రకటించాలి.. డాక్టర్​ మర్డర్​తో ఆందోళన

కేరళలో డాక్టర్​ వందనా దాస్​ హత్య నేపథ్యంలో మెడికల్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న హెల్త్​ వర్కర్స్​, ఉద్యోగులు అంతా ఒక్కసారిగా షాక్​కి గురయ్యారు. అయితే.. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారి సంరక్షణ విషయంలో కేరళ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. పనిచేసే చోట సురక్షితమైన, నమ్మకంగా ఉండే వాతావరణాన్ని కల్పించాలని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) కేరళ శాఖ ప్రభుత్వాన్ని కోరింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

డాక్టర్ వందనా దాస్ హత్య నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల రక్షణ కోసం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను స్వాగతిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. సురక్షితమైన, నమ్మకంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రోగులకు మెరుగైన చికిత్సను అందజేసే అవకాశం ఉంటుందని IMA కేరళ శాఖ వివరించింది.

కాగా, ఆరోగ్య రంగంలో పనిచేసే వారిపై దాడులు జరిపే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, ప్రత్యేక కోర్టులు, త్వరితగతిన విచారణ వంటి అంశాలను తాము స్వాగతిస్తున్నామని ఐఎంఏ తెలిపింది. డాక్టర్ వందనా దాస్ మృతికి కారణమైన పోలీసుల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరిపించాలని ఐఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆమె తల్లిదండ్రులను సంప్రదించి, ఆ తర్వాత ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని కోరింది.

- Advertisement -

ఇక.. సోషల్​ మీడియా ద్వారా, ఆసుపత్రి ఆవరణలోనూ దాడులు చేయడం వంటివి వాటిని కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేరళ వైద్య సంస్థ పేర్కొంది. ప్రశాంతమైన పని వాతావరణం ఉంటే తప్ప సరైన చికిత్సా అందించలేమని, ఆసుపత్రులను హైసెక్యూరిటీ జోన్‌లుగా ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ కోరింది, ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, ఆర్డినెన్స్ ను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ ప్రభుత్వానికి విన్నవించింది. ఆరోగ్య కార్యకర్తల ప్రాణాలను కాపాడేందుకు కేరళ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు న్యాయ వ్యవస్థపై సమాజానికి విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో అత్యంత సహాయకారిగా ఉన్నాయని IMA సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement