బిహార్ రాష్ట్రంలో ఓ పెద్దపులి టెర్రర్‌గా మారింది. మ్యాన్ ఈటర్‌గా మారిన ఈ పెద్దపులి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు బలిగొంది. దీంతో అక్కడి అటవీశాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు ఆ పులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇవ్వాల (శనివారం) కూడా ఆ మ్యాన్ ఈటర్ దాడిలో ఓ తల్లి, ఆమె పదేళ్ల కొడుకు చనిపోయారు. తల్లీ కొడుకుల మృతితో కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులపై దాడి చేశారు. వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.
ఇక.. బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహాలో తొమ్మిది మందిని చంపిన ఈ మ్యాన్ ఈటర్ పెద్దపులిని చంపేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా పులి దాడిని అరికట్టేందుకు పలు చోట్ల వలలు బిగిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా దీనిలో పాలుపంచుకుని స్థానికులను కాపాడే చర్యలు తీసుకుంటున్నారు.