Friday, November 22, 2024

తొమ్మిది మందిని చంపేసిన పెద్దపులి.. మ్యాన్​ఈటర్​ని మట్టుబెట్టేందుకు యాక్షన్!​

బిహార్​ రాష్ట్రంలో ఓ పెద్దపులి టెర్రర్​గా మారింది. మ్యాన్​ ఈటర్​గా మారిన ఈ పెద్దపులి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు బలిగొంది. దీంతో అక్కడి అటవీశాఖ, నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ అధికారులు ఆ పులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇవ్వాల (శనివారం) కూడా ఆ మ్యాన్​ ఈటర్​ దాడిలో ఓ తల్లి, ఆమె పదేళ్ల కొడుకు చనిపోయారు. తల్లీ కొడుకుల మృతితో కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులపై దాడి చేశారు. వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.

ఇక.. బిహార్​లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగాహాలో తొమ్మిది మందిని చంపిన ఈ మ్యాన్​ ఈటర్​ పెద్దపులిని చంపేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా పులి దాడిని అరికట్టేందుకు పలు చోట్ల వలలు బిగిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా దీనిలో పాలుపంచుకుని స్థానికులను కాపాడే చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement