Tuesday, November 19, 2024

Alert | తెలంగాణకు ఆరెంజ్ అల‌ర్ట్‌.. మ‌రో అయిదు రోజుల‌పాటు వ‌ర్షాలుంట‌య్‌

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. ఇక‌.. రాగల మ‌రో అయిదు రోజుల పాటు కూడా వర్షాలుంటాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇవ్వాల (ఆదివారం) తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్‌ జారీ చేసింది.

కాగా, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్సెస్ ఉన్నాయ‌ని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం కరీంనగర్‌, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement