ఆప్టికల్ ఇల్యూజన్.. మన కళ్లను మనమే నమ్మలేని నిజాలు.. మన కంటిచూపును, ఆలోచనలను సవాలు చేసే కొన్ని ఫొటోలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఫొటోలు మన సత్తా ఏంటో తెలియజేస్తాయి. అందుకనే ఈ విజువల్స్ సంక్లిష్టంగా రూపొందించారు కళా నిపుణులు. ఇది మెదడుకు మేత వంటిది. ఇలాంటి ఫొటోలను కరెక్ట్‌గా కనిపెట్టడం ఓ సవాలుగానే స్వీకరించాలి.
జోహన్నెస్ స్టోటర్.. మనస్సు దోచే బాడీ పెయింటింగ్స్, కళలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, పొద్దుతిరుగుడు పువ్వుపై విశ్రమిస్తున్న సీతాకోకచిలుక చిత్రాన్ని ఆయన గీశారు. అయితే.. ఈ చిత్రంలో కంటికి కనిపించిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. అది పరీక్షగా చూస్తే కానీ కనిపెట్టలేము.
ఇందులో దాగి ఉన్న మహిళ ముఖాన్ని ఏడు సెకన్లలోపు మీరు కనుగొనగలరా?
చాలా మంది తమకు ఇచ్చిన సమయ వ్యవధిలో స్త్రీ ముఖాన్ని గుర్తించలేకపోయారు. ఇది ఆందోళనకు కారణం కాదు. స్త్రీ ముఖం సీతాకోకచిలుక రెక్కల లోపల, ప్రత్యేకంగా రెక్కకు కుడి వైపున ఉంది పరీక్ష చూస్తే కానీ అది అవగతం కాదు..
Here’s the woman’s face. Were you able to spot it?