నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని విపక్షాలు లేఖలో తెలిపాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని విపక్షపార్టీలు తెలిపాయి. అలాగే పార్లమెంట్ లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి.