భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ‘కమల్’ని వేగవంతం చేసింది. ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ బీజేపీ నేతలు డీకీ అరుణ, చేరికల కమిటీ ఇన్చార్జి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని పలువురు లీడర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో స్వామీజీలతో బేరసారాలు నడిపి అడ్డంగ బుక్కైన బీజేపీ.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకును బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. దీనికిగాను నియోజకవర్గ స్థాయి లీడర్లను ఆహ్వానిస్తూ ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతతో పాటు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ల లీడర్లతో పాటు ఇద్దరు ఎమ్మెల్యలేను ఆహ్వానించినట్టు సమాచారం. బీజేపీలో చేరికల కోసం మంతనాలు జరపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో కనిపించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, తెలంగాణ లీడర్లపై మర్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజీపీలో చేరడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా వట్టిదేనని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు.