హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వడివడిగా దూసుకు వెళ్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండేలా సమయ సంద ర్భాలను బట్టి ప్లాన్‌లను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. గత మూడు నెలలుగా గ్రామాలకే పార్టీ నేతలు పరిమితం అయ్యారు. ప్రజలతో మమేకం అయ్యేలా చేపట్టిన కార్యక్రమా లను విస్తృతంగా నిర్వహించారు. కానీ కొంత మంది హంగూ, ఆర్భాటాలకు పోతున్నారన్న రిపోర్ట్ అధినేత చేతికి అందింది. ప్రతి విషయాన్ని గమనిస్తున్న అధినేత కేసీఆర్.. వారికి సీరియస్ వార్నింగ్‌ను సైతం ఇప్పించారు. ఇద్దరు పార్టీలోని ప్రధాన లీడర్లకు ఫోజులు తగ్గించి, జనంతో మమేకం అవ్వాలని గట్టిగా నొక్కి చెప్పారని గులాబీ వర్గాల్లో గుసగసలాడు కుంటున్నారు. వారే కాకుండా ఇంకా చాలా మంది ప్రజలతో మమేకం కాకుండా ఉన్నవారి జాబితా సైతం సీఎం కేసీఆర్ చేతిలో ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి వారిని కూడా పిలిచి మందలించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. జిల్లాల్లో గ్రూప్‌లు, వర్గాలను పెంచి పోషించడాన్ని కూడా సీరియస్‌గా పరిగణి స్తున్నట్లు తెలు స్తోంది. ఆ జాబితా సిద్ధం చేసిన అధినేత వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుం టారని గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇద్దరికి సీరియస్ వార్నింగ్
గత కొన్ని నెలలుగా అధికార భారాస ఎన్నికల స్ట్రాటజీని మొదలు పెట్టింది. ఆత్మీయ సమ్మేళనాలతో మొదట ప్రజా క్షేత్రంలోకి వెళ్లింది. అప్పటి నుంచి వరుసగా జనంలోనే ఉంటూ వస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పేపర్లు, మీడి యాలో మాత్రమే హైలెట్ అవు తున్న కొంత మంది నేతలు.. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడంలో వెనకబడి ఉన్నట్లుగా అధినేత గ్రహించారు. త్వరలో వారం దరిని పిలిచి మందలించే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉండకపోవడంపై అధిష్టానం అసహానం వ్యక్తం చెెస్తోంది. జనంతో మమేకం అయ్యేలా కార్యక్రమాలను నిర్వహించినా.. వెనకబడి ఉండడాన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది.
ఇప్పటి వరకు అయితే ఇద్దరు ప్రధాన లీడర్లను పిలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధినేత మనసులోని మాటను గట్టిగా చెప్పినట్లుగా బీఆర్‌ఎస్ నేతలు తెలుపుతున్నారు. వారే కాకుండా త్వరలో మిగతా వారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలిచి వన్ టూ వన్ నిర్వహించడమే కాకుండా హెచ్చరించే అవకాశం ఉంది.
సైలెంట్‌గా వడపోత..
జనంలో ఉండాలి. జనంతో మమేకం అవ్వాలి. ఓటు బ్యాంకు పెరగాలి. ఓట్లు చీల కూడదు. అసంతృప్తి తగ్గాలి. వర్గపోరు సమసి పోవా లి. సంక్షేమం ప్రజలకు తెలవాలి. గులాబీ శ్రేణులంతా జనం వద్ద కు 9 ఏళ్ల పాలన, భారాస సర్కార్ చేసిన ప్రగ తిని తీసుకెళ్లాలి.. ఇలా ప్రతి ఒక్కదాన్ని చిన్న పిల్లలకు చెప్పినట్లుగా పార్టీ నేతలకు అధినేత సూచించినా కొంత మంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వెనకబడి ఉన్న సిట్టింగ్‌లకు ఇకపై ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదన్న విధంగా అధినేత కృతనిచ్ఛయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయా స్థానాల్లో ఆశావహులకు గెలుపు అవకాశం ఉంటే ప్రోత్సహించాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చి నట్లుగా స్పష్టం అవుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో గెలుపు అవకా శాలు, పార్టీ బలం, సామాజిక వర్గాలు, లబ్ధిదారుల జాబితా.. ఇలా రక రకాలుగా భారాస బాస్ అంచనా వేసు ్తన్నారు. కూడికలు, తీసివేతలతో సైలెంట్‌గా వడపోత జరుగుతున్నట్లు గులాబీ వర్గాలు తెలుపుతున్నాయి.