హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రతినిధులు.. ఇతర ముఖ్య నాయకలు గుడ్ బై చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలోని అసంతృ ప్తులకు హస్తం పార్టీ ఇప్పుడు వేదికగా మారుతోంది. గతంలో పార్టీని వీడిన నాయకులు ..సొంత గూటికి చాలా మంది తిరుగు ప్రయాణం అవుతున్నారు. వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో టికెట్ రాదని కొం దరు.. బీజేపీలో టికెట్ వచ్చినా విజయం సాధించడం కష్టమని అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్ట్రాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబి గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వారికి.. కాంగ్రెస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఎన్నికల దగ్గరప డుతున్నకొద్ది పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. దీంతో తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని మరి కొందరు మదనపడుతున్న వారిలో చాలా మంది తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నా రని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరి కొందరు నాయకులకు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు టచ్‌లోకి వస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో విజయం సాధించి.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన విషయం తెలిసిందే. సబితపై పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు.. కాంగ్రెస్ గూటికి రావడం ఖాయమైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరెకల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటా రని ప్రచారం జరుగుతోంది. ఈ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చిరమర్తి లింగయ్య విజయం సాధించి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి పోటి చేసి ఓటమి చెందిన వేముల విరేశం, చిరుమర్తి మధ్య వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ రాకుంటే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచ నతో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వేముల విరేశం చేరికను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చేం దుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరు గుతోంది. మంత్రి మల్లారెడ్డితో మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మధ్య సఖ్యత లేదని, అందుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో సుదీర్ రెడ్డి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలా రాష్ట్రంలోని చాల మంది నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఆప్షన్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది.