హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇక ఏటా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వల్ల గత విద్యాసంవత్సరంలో 11 పేపర్లకు బదులు ఆరు పేర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.
తాజాగా ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. కరోనా కారణంగా విద్యార్థులపై సిలబస్ భారం పడకుండా ఉండేందుకు గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకే నిర్వహించారు. అలాగే సిలబస్‌లోనూ కూడా మినహియింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ ఏడాది నుంచి ఇక ప్రతి సబ్జెక్టు ఒక పేపర్ ఉండనుంది.