Friday, November 22, 2024

ద‌ళితుల‌కోస‌మే – భీమ్ భార‌త్ పార్టీ- జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్

విజ‌య‌వాడ‌లో జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. భీమ్ భార‌త్ పార్టీ పేరుతో ఏపీ రాజ‌కీయాల్లో కొత్త పార్టీని నెల‌కొల్పారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నారు. 28 సంవత్సరాలకే న్యాయమూర్తి అయిన తాను పదేళ్లలోనే ఆ పదవిని వదిలి వచ్చేశానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత బిడ్డలకు తాను మేనమామలా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వారికి చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోబోమన్నారు. వైసీపీలోని దళిత నేతలను ఓడించేందుకే పార్టీని పెడుతున్నాన‌న్నారు. దళితులకు అందే 26 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపో, ఓడించు, గెలువు అన్న కాన్షీరాం మాటలే తనకు స్ఫూర్తి అని శ్రవణ్ కుమార్ అన్నారు. రూపాయికి కిలో బియ్యం, రూ. 200కు నూనె ప్యాకెట్ ఇచ్చే వారిని పొగుడుదామా అని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement