కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో వివాహాలు, ఫంక్షన్లకు 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అన్ని క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ లను మూసివేయాలని ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రజారవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని సూచించారు. రెమ్‌డెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేల రెమెడెసివర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమెడెసివర్కు కొరత లేదన్నారు. అన్నిరకాల వృథాను అరికట్టాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. రాష్ట్రానికి 341టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించిందని అయినా సరిపోవట్లేదని పేర్కొన్నారు. ఆక్సిజన్ వినియోగాన్ని పర్యవేక్షిస్తామన్నారు. చాలా చోట్ల ఆక్సిజన్ వృథా అవుతోందని, అవసరం లేకున్నా ఆక్సిజన్ వాడుతున్నారని సింఘాల్ చెప్పారు.
ఏ వేడుకైనా 50మందికే అనుమతి!
Advertisement
తాజా వార్తలు
Advertisement