Thursday, November 21, 2024

పెండింగ్‌ చలానాల ‘పైసా వసూల్’.. రాయితీతో రూ.130 కోట్లు జమ

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలు చెల్లించేందుకు ప్రకటించిన రాయితీలకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.30 కోట్ల చలానాలు క్లియర్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాలో రూ.130 కోట్లు జమయ్యాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచే 80 శాతం ట్రాఫిక్‌ చలానాలు క్లియర్‌ అయ్యాయి. ఇప్పటివరకు రూ.500 కోట్ల విలువైన చలానాలకు రాయితీ ప్రకారం రూ.130 కోట్లు వసూలయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాల ద్వారా మొత్తంగా రూ.300 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. రాయితీ సదుపాయాన్ని వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు.

కాగా, భారీగా పేరుకుపోయిన ట్రాఫిక్‌ చలానాలకు పోలీస్‌ శాఖ ఆకర్షణీయమైన రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బైక్‌లకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70% రాయితీ కల్పించారు. మార్చి 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రాగా ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement