Friday, November 22, 2024

ఆన్ లైన్ లో టీచింగ్ .. నెల‌కి రూ. కోటి సంపాద‌న .. ఎలా అనుకుంటున్నారా ..

నెల‌కి కోటి రూపాయ‌లు ఈజీగా సంపాదిస్తోంది ఓ యువ‌తి. ఎలా అనుకుంటున్నారా ఆన్ లైన్ టీచింగ్ చేస్తూ.. అయితే ఈ యువ‌తి బోరింగ్ స‌బ్జెక్ట్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా చెబుతుండ‌టంతో ల‌క్ష‌లాదిమంది ఇంప్రెస్ అయిపోయారు. అమెరికాకి చెందిన కేట్ నోర్టన్ అనే 27 ఏళ్ల యువతి టిక్ టాక్ , ఇన్ స్టా గ్రామ్ లో మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ , గూగుల్ షీట్స్ గురించి క్లాసులు చెబుతూ నెల‌కి కోటి రూపాయ‌ల‌కి పైనే సంపాదిస్తుండ‌టం విశేషం.. కాగా ఆమెకి సోష‌ల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త బోరింగ్ గా అనిపించే ఎక్సెల్, గూగుల్ స్ప్రెడ్ షీట్ లపై పాఠాలు చెప్పేందుకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం ఆమె వ‌దులుకోవ‌డం విశేషం. మొదట Ms excel పేరిట ఇన్ స్టాగ్రామ్ , టిక్ టాక్ లో ఆమె ఖాతాలు ప్రారంభించింది. గతేడాది నవంబర్ లో ఆన్లైన్ టీచింగ్ బిజినెస్ మొదలుపెట్ట‌డంతో ఆమె ద‌శ తిరిగింది.

సరదాగా డాన్స్ చేస్తూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి ఆసక్తికరంగా పాఠాలు చెబుతుంది ఈ యువ‌తి. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ తరగతులకు హాజరు అయ్యే వారి సంఖ్య కొద్ది రోజుల్లోనే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 2021 ఏప్రిల్ నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయం అందుకున్నారు. కేట్ ప్రియుడు సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమెకు సాయం చేస్తున్నాడు.వారిద్ద‌రూ కలిసి ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఎక్సెల్, గూగుల్ షీట్స్ పై పూర్తిస్థాయి శిక్షకురాలు గా మాత్రమే కాకుండా… ఇతర ఆన్ లైన్ ప్రొడక్ట్స్, కోర్సులకు సంబంధించి సమాచారాన్ని బోధిస్తూ కేట్ రెండు చేతులా సంపాదిస్తుంది. ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఏప్రిల్ 2021లో తన మొదటి ఆరు అంకెల సంపాదనకు చేరుకుంది. ప్రస్తుతం నార్టన్ డిజిటల్ నోమాడ్‌గా మారింది. అంటే సంచారజీవి అన్నమాట. తన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె ప్రతి నెల కొత్త నగరానికి వెళుతుంది. అక్కడ తన క్లాసులను విస్తరిస్తూముందుకు సాగుతుంది. ఆమె అతి త్వరలో ఏడు అంకెల సంపాదన నెలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధించి తీరుతాన‌నే న‌మ్మ‌కం ఉందంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement