Saturday, November 23, 2024

ఆన్ లైన్ షాపింగ్ దేశాల జాబితాలో అమెరికా త‌ర్వాత భార‌త్..

క‌రోనా ప్రారంభం నాటి నుంచి ఆన్ లైన్ షాపింగ్ లు చేసేవారి సంఖ్య పెరిగింది. దాంతో ప‌లు సంస్థ‌లు పండ‌గ‌ల‌కి భారీ ఆఫ‌ర్స్ కూడా ఇస్తుండ‌టంతో ఈ కొనుగోళ్ల సంఖ్య మ‌రింత‌గా పెరుగుతోంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ విలువ రెండున్నర రెట్లు పెరిగి 500 బిలియన్‌ డాలర్ల(రూ.37 లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్‌ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబం ఏడాదికి 13-14 వేల డాలర్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ఖర్చు చేస్తుండగా..2026 నాటికి 19-20 వేల డాలర్లకు చేరుకోనున్నది. వచ్చే ఐదేండ్లలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానాన్ని అక్రమించనున్నది. 2.5 కోట్ల మందితో అమెరికా తొలి స్థానంలో ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement