Tuesday, November 26, 2024

Telangana: తెలంగాణలో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు!

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జనవరి తొలి వారంలోనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో ఈ నెల 20వరకు కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఖాయమని తెలుస్తోంది. రాష్ట్రంలో 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, దీనిపై ఆదివారం విద్యాశాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement