Friday, November 22, 2024

ఓన్​జీసీ చాపర్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​.. 9మందిని రెస్య్కూ చేసి కాపాడిన డిఫెన్స్​ బృందం

ముంబైకి సమీపంలో సముద్రంలో జరిగిన ఓ హెలికాప్టర్​ ప్రమాదంలో చిక్కుకున్న వారికోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​ సక్సెస్​ అయ్యింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓన్​జీసీ)కి చెందిన హెలికాప్టర్ 9 మందితో వెళ్తుంటే.. అరేబియా సముద్రంలో ఆయిల్ రిగ్ సమీపంలో ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో చిక్కుకున్న వారందరినీ రక్షించామని, వారు క్షేమంగానే ఉన్న‌ట్టు డిఫెన్స్​ అధికారులు తెలిపారు.

ముంబైకి పశ్చిమాన 60 నాటికల్ మైళ్ల దూరంలో ONGC సాగర్ కిరణ్ ఆఫ్‌షోర్ రిగ్‌కు సమీపంలో ఇవ్వాల (మంగళవారం) ఉదయం దాదాపు 11:50 గంటలకు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది ఉన్నారు. దీంతో అరేబియా స‌ముద్రంలోని ఆయిల్ రిగ్ ద‌గ్గ‌ర్లో దీన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. వారిని ర‌క్షించేందుకు మాల్వియా 16 అనే ఫిప్​ని రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి మళ్లించారు. కోస్ట్ గార్డ్ కి చెందిన విమానం కూడా ఆ ప్రదేశానికి లైఫ్ బోట్​లతో వెళ్లింది. రెస్క్యూ ఆపరేషన్‌కి సహాయం చేయడానికి మరొక ఓడ కూడా వెళుతోంది అని అధికారులు తెలిపారు.

కాగా, ఓఎస్‌వీ మాల్వియా 16 ద్వారా నలుగురిని, సాగర్ కిరణ్ ఆయిల్ రిగ్‌లోని పడవలో ఒకరు, ఇండియన్ నేవీ ఏఎల్‌హెచ్, సీకింగ్ హెలికాప్టర్‌ల ద్వారా ఒక్కొక్కరు ప్రాణాలు కాపాడుకున్నారు. ఓఎన్‌జీసీ ఆస్పత్రిలో నిర్వహణ కోసం నేవీ హెలికాప్టర్ల ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురిని జుహుకు తరలించారు.. అని డిఫెన్స్ పీఆర్​వో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement