స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే వాటిలో ఫస్ట్ ప్లేస్‌లో ఆపిల్ ఐఫోన్ ఉంటే.. ఆ తర్వాత స్థానంలో వన్‌ప్లస్ ఫోన్ ఉంటుంది. ఆపిల్‌కు ఉన్నంత క్రేజ్ ఈ వన్‌ప్లస్‌కు ఉండడానికి దాని ప్రత్యేకమైన ఐఓఎస్ కారణంగా చెబుతుంటారు టెక్ ఎక్స్‌పర్ట్స్. అయితే.. ఆపిల్ ఐఫోన్లకు దీటుగా దీనిలో స్పెసిఫికేషన్స్, ఇంటర్నర్, ఎక్స్‌టర్నల్ ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి. బడ్జెట్ రేంజ్‌లోనే ఈ ఫోన్లు లభిస్తుండడం, ఆపిల్ ఫోన్లకు దీటుగా వర్క్ చేయడంతో చాలామంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకన్నా దీనిలో ఉండే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుండడంతో స్మార్ట్‌ఫోన్ లవర్స్ వన్‌ప్లస్ ఫోన్లను లైక్ చేస్తుంటారు.
అయితే.. ఈ మధ్య 10 సిరీస్‌లో భాగంగా రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన వన్‌ప్లస్ తాజాగా తన సెగ్మెంట్‌లోని 10టి సిరీస్‌ని కూడా లాంచ్ చేయబోతోంది. 8టి మోడల్ తర్వాత 9 సిరీస్‌లో దీన్ని తీసుకురాలేదు. కానీ, 10 సిరీస్‌లో మళ్లీ ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేస్తోంది. కాగా, దీనికి సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే బయటికి లీక్ అయ్యాయి.
OnePlus ఇవ్వాల (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా OnePlus 10T స్మార్ట్ పోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ 10-సిరీస్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ది బెస్ట్ అంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్. ఇంకా అత్యంత పవర్‌పుల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. OnePlus కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌కి సంభందించిన చాలా సమాచారాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCలో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. లాంచ్ ఈవెంట్‌కు ముందు OnePlus 10T అన్‌బాక్సింగ్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. “ఎంబార్గోస్ ఆర్ ఓవర్‌రేట్డ్” అనే టైటిల్‌తో బాక్స్, హ్యాండ్‌సెట్ లోపల ఏముందనే విషయాలను ఈ వీడియోలో కంపెనీ తెలియజేసింది.
ఇక.. ఫోన్ పూర్తిగా HD+ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో ఉంటుంది. 8+ Gen 1 SoC గరిష్టంగా 16GB RAMతో రానుంది. OnePlus 10T 5G లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లో ఇవ్వాల ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఈవెంట్ ఇవ్వాల రాత్రి 7:30కి ఉండనుంది. కాగా, ఈ లాంచ్ ఈవెంట్‌ని OnePlus వెబ్‌సైట్ , లేదా అధికారిక YouTube చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చని కంపెనీ తెలిపింది.