Tuesday, November 26, 2024

OnePlus 10 Pro.. అఫీషియల్ లుకింగ్.. టీజర్ వీడియో.. లాంచ్ అప్ డేట్..

ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌గా రాబోతున్న వన్ ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు అఫీషియల్ గా వెల్లడయ్యాయి. కొత్త పేరుతో లాంచ్ కానున్న స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ రానున్నట్టు తెలుస్తోంది. వన్ ప్లస్ ఫోన్లనంటే టెక్ ప్రియులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. వన్ ప్లస్ (OnePlus) నుంచి ఏదైనా ఫోన్ వస్తుందంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. 2021లో వన్ ప్లస్ 9 సిరీస్ (OnePlus 9 series) విజయవంతం కావడంతో ఇదే జోష్ లో 10 సిరీస్ (OnePlus 10 series) ఫోన్లను తీసుకొచ్చేందుకు వన్ ప్లస్ రెడీ అవుతోంది.

ఇదే తరుణంలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌గా రాబోతున్న వన్ ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) స్పెసిఫికేషన్లు కొన్నింటిని అఫీషియ‌ల్ గా అందుబాటులోకి వ‌చ్చాయి. జనవరి 5న కానీ, 11వ తేదీన కానీ విడుదల కావాల్సిన ఈ ఫోన్ వివరాలు ఇప్పుడే వెల్లడయ్యాయి. అలాగే డిజైన్ కు సంబంధించిన వివరాలు కూడా బయటికి వచ్చాయి.

కెమెరాల విషయంలో కాస్త వన్ ప్లస్ 9 ప్రోను పోలిన విధంగానే 10 ప్రో ఉంటుందని సమాచారం. వన్ ప్లస్ 10 ప్రోలో వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగాపిక్సెల్ టెలీ ఫొటో లెన్స్ కెమెరా ఉంటాయి.

వన్ ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు..
వన్ ప్లస్ 10 ప్రో క్యూఎల్ఈడీ ప్లస్ 6.7 ఇంచుల కర్వ్ డ్ అమెలెడ్ డిస్ ప్లేతో రానుంది. ఈ మోడల్ కు ఇదో ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది. అలాగే 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 32 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా కోసం స్క్రీన్ పైన ఎడమ మూలన పంచ్ కటౌట్ ఉండనుంది.

ఇక స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్‌ ఇందులో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 888కు సక్సెసర్ గా రానున్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ వన్ ప్లస్ 10 ప్రోలో ఉండనుంది. ఈ కొత్త ప్రాసెసర్‌ను క్వాల్కామ్ డిసెంబర్ 30న స్నాప్‌డ్రాగన్ సమిట్ లో లాంచ్ చేసింది. ఇక 10 ప్రో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. అయితే చార్జింగ్ స్పీడ్ పై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫోన్ 125 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

వన్ ప్లస్ 10 ప్రో మోడల్ 8జీజీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ తో రానుంది.

వన్ ప్లస్ 10 ప్రో 2022 జనవరి 5వ తేదీన కానీ, 11వ తేదీన కానీ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వన్ ప్లస్ ఆర్టీ మొబైల్ త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వన్ ప్లస్ 9 ఆర్టీకి రీబ్రాండెడ్ మోడల్ గా ఉండనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement