ఏపీలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్న వేళ… కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విశాఖలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. అచ్యుతాపురంకు చెందిన ఏడాదిన్నర పాప కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇందుకు ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారికి కరోనా లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు వైజాగ్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ముందే లక్ష రూపాయలు కట్టించుకున్న ఆస్పత్రి యాజమాన్యం.. చేతులెత్తేయడంతో చిన్నారిని వెంటనే అంబులెన్సులో కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్లు సరిపడా లేకపోవడంతో అంబులెన్సులోనే చిన్నారికి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చిన్నారి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో చిన్నారి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement