రూపాయి విలువ పతనమవుతోంది. ఇంట్రాడేలో 36 పైసలు నష్టపోయింది. డాలర్ తో 78 కంటే దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి రావడం ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువలు, స్టాక్స్ విలువపై ప్రభావం పడేలా చేసింది. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు డాలర్ పైనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత దూకుడుగా పెంచుతుందున్న అంచనాలతో డాలర్ బలపడింది. మన దిగుమతుల్లో అధిక భాగం డాలర్ మారకంలోనే జరుగుతాయి. అంతర్జాతీయంగా పెరిగిన కమోడిటీ ధరలతో అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ చేస్తుండడం కూడా రూపాయి విలువపై ప్రభావం పడేలా చేస్తోంది. గత శుక్రవారం డాలర్ తో రూపాయి 19 పైసలు నష్టపోయి 77.93 వద్ద క్లోజ్ కావడం గమనార్హం. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాల కనిష్టానికి సోమవారం పడిపోయింది. 78.29గా నమోదైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement