Saturday, November 23, 2024

Good News: నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకదానికి ప్రెగ్నెన్సీ?

నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటి ప్రెగ్నెంట్​ అయి ఉండవచ్చు అని దాని సంరక్షణ చూస్తున్న డాక్టర్​ తెలిపారు. అయితే.. ఇది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇక.. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రధాని మోదీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17న) మధ్యప్రదేశ్‌లోని కునా నేషనల్ పార్క్ లో ఎనిమిది చిరుతలను వదిలిపెట్టారు.  అందులో ఒకటి ఇప్పుడు గర్భిణి అని వార్తలొస్తున్నాయి. ‘‘అవును ఇది నిజం, ఆ చిరుత గర్భవతి కావచ్చు. మేము కచ్చితంగా చెప్పలేము, కానీ దాన్ని చూస్తుంటే అట్లానే అనిపిస్తోంది. ఇది దానికి మొదటి ప్రెగ్నెన్సీ కూడా అయి ఉంటుంది”అని చిరుత సంరక్షణ కేంద్రం (CCF) యొక్క డాక్టర్ లారీ మార్కర్ చెప్పారు.

ఇక.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తామంతా వెయిట్​ చేస్తున్నాం అన్నారు. CCFని కలిగి ఉన్న కునో వద్ద ప్రాజెక్ట్ చిరుత బృందం సిద్ధంగా ఉంది. దానికి పిల్లలు పుడితే ఇది నమీబియా నుండి మరొక బహుమతి అవుతుంది. అన్నారు. ఇది కచ్చితంగా ప్రెగ్నెన్సీ అవునో, కాదో త్వరలో తెలుసుకుంటామని చెప్పారు. అయితే ఆ చిరుత గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

చిరుత పేరు ఆషాఅని, అది గర్భవతి అయితే దాని పిల్లలకు, దానికి ప్రైవసీ కల్పించాల్సి ఉంటుంది. ఓ ఎన్‌క్లోజర్‌లో ఒక ఎండుగడ్డి గుడిసె లాంటిది ఏర్పాటు చేస్తామని డాక్టర్ మార్కర్ చెప్పారు. అయితే ఈ వార్తలను కునో నేషనల్ పార్క్ అధికారి ప్రకాష్ కుమార్ వర్మ కొట్టిపారేశారు.

“ఆడ చిరుత గర్భం దాల్చిందన్న వార్త తప్పుదోవ పట్టించేది. నమీబియా నుంచి ఎలాంటి పరీక్షలు చేయలేదు. గర్భం దాల్చిన నివేదిక కూడా ఇవ్వలేదు. ఈ వార్త ఎలా వ్యాపించిందో నాకు తెలియదు” అని ఆయన అన్నారు.  ఆశా చిరుత కాకుండా మూడు మగ చిరుతలు – ఫ్రెడ్డీ, ఎల్టన్, ఒబాన్​తో పాటు మరో నాలుగు ఆడ చిరుతలు- సియాయా, సాషా, టిబిలిసి, సవన్నా అదే రోజు నమీబియా నుండి వచ్చాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement