Friday, November 22, 2024

ఒకే దేశం – ఒకే ప‌న్ను – మ‌ద్యం మాటేమిటి?

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయ ముండడంతో ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌ వైపు ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. భారత ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఎంచుకునే ప్రాధాన్యతాంశాలపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతోంది. గత దశాబ్దకాలంగా భారత ఆర్ధిక వ్యవస్థ జోరుగా పరుగులెడుతోంది. అగ్ర దేశాలను మించి వార్షిక సగటు వృద్దిని నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థను కూడా భారత్‌ అధిగమించింది. అలాగే దేశీయం గానూ సంక్షేమం, అభివృద్ది రెండింటికి సమ ప్రాధాన్యత నిస్తోంది. కోవిడ్‌ అనంతరం వ్యవస్థల పునర్‌నిర్మాణానికి పటిష్టమైన పథకాల ు అమలు చేస్తోంది. సహజంగానే ఎన్నికల ముందు ఏడాది బడ్జెట్‌ అంటే ఓటర్లను ఆక ట్టుకునే ప్రక్రియకే ఏ ప్రభుత్వాలైనా ప్రాధాన్యతనిస్తాయి.

నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే దిశగా యోచిస్తారా లేక పరుగులు పెడుతున్న ఆర్ధిక వ్యవస్థకు ఏ మాత్రం కుదుపు లేకుండా సంక్షేమాన్ని పక్కనపెట్టి దీర్ఘకాలిక అభివృద్ది పథకాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తారా? ప్రపంచ స్థాయి పెట్టుబడి దార్లను ఆకర్షించే విధంగా ఈ బడ్జెట్‌లో ప్రకటించే పథకాలుంటాయా? దేశంలో పారిశ్రామిక మౌలిక వసతుల విస్తరణకు పెద్దపీటేస్తారా? నేరుగా క్షేత్రస్థాయిలో పేదలకు నగదు అందించే పథకాలకే పరిమితమౌతారా? ఇలా రకరకాల అంచనాల కొనసాగుత ున్నాయి.
అంతర్జాతీయంగా భారత ఆర్ధిక వ్యవస్థపై సానుకూల దృక్పధం కనిపిస్తోంది. అయితే దేశీయంగా పేదల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నియంత్రించే వ్యవస్థలు విఫలమయ్యాయి. ఒకే దేశం, ఒకే పన్ను విధానం కొన్ని రంగాల్లో మాత్రమే సత్ఫలితాల్నిచ్చింది. జిఎస్‌టి అమలుతో కొన్నిరంగాలు కుదేలయ్యాయి. తాజాగా పెట్రోల్‌ ఉత్పత్తుల్ని వ్యాట్‌ పరిధిలోకి తేవడం దేశీయంగా కొంత ఉపశమనం కలిగించింది. జిఎస్‌టి అమల్లోకొచ్చినప్పట్నుంచి ఈ డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్నాళ్ళకు జిఎస్‌టి కౌన్సిల్‌ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకే దేశం.. ఒకే ధర విధానం పెట్రోలియం ఉత్పత్తులకు కూడా అమల్లోకొచ్చేస్తోంది. రాష్ట్రాన్ని బట్టి, రవాణా ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకుని కొంత మేర ధరల్లో వ్యత్యాసమున్నా గతంలో లా రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య 30నుంచి 50శాతం వరకు ధరల వ్యత్యాసం కొనసాగే అవకాశమైతే లేదు. దేశంలో ఏ మూలనైనా పెట్రోలియం ఉత్పత్తులు ఒకే ధరకు అందుబాటులోకొస్తున్నాయి.


ఇదే విధంగా మద్యం ధరలపై కూడా కేంద్రందృష్టిసారించాలి. రాష్ట్రాలు తమ సం క్షేమ పథకాల అమలు కోసం పెట్రోలియం, మద్యం విక్రయాలపై సమకూరే ఆదాయంపైనే దృష్టిపెడుతు న్నాయి. పెరుగుతున్న సంక్షేమ వ్యయానికనుగుణంగా ఈ రెండింటిపై ఇంతవరకు పన్నుల శాతాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు వ్యాట్‌ పరిధిలోకెళ్ళ డంతో మద్యంపై మరింతగా పన్నుల బాదుడు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో కేంద్రం దేశం మొత్తం మద్యం విక్రయాల్ని తన పరిధిలోకి తీసుకోవాలి. లేదా ఈ విక్రయాలపై దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్నుల విధానాన్ని అమలు చేయాలి. కేంద్రం స్వయంగా మద్యం విక్రయాలకు పూనుకుంటే ఆరోగ్యకరమైన మద్యం మాత్రమే అందుబాటులోకొస్తుంది. అనారోగ్యాలు కలుగజేసే బ్రాండ్లు, మద్యం రకాల బారి నుంచి వినియోగదార్లు తప్పించుకునే వీలేర్పడుతుంది. అలాగే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య మద్యం ధరల్లో వ్యత్యాసాలు తగ్గిపోతాయి. దేశం మొత్తం ఒకే తరహా మద్యం, ఒకే తరహాధర విధానం అమల్లోకొస్తుంది. ఇది మద్యం విక్రయాలు, వినియోగాల్లో కూడా విప్లవాత్మక మార్పు తెస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, సైనిక వ్యయం, అభివృద్ది, సంక్షేమ పథకాల్తో పాటు దేశీయంగా ఒకే ధరలు అమలయ్యేలా చూడ్డం కూడా ఈ బడ్జెట్‌ ముందున్న ప్రాధాన్యతాంశమేనంటూ వీరు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement