Saturday, November 23, 2024

ఖుష్భూకి ఓ న్యాయం.. రాహుల్ గాంధీకి మరో న్యాయ‌మా

2018లో న‌టి ఖుష్భూ చేసిన ట్వీట్ లో ప్ర‌ధాని మోడీ ఇంటిపేరు అవినీతిగా మారింద‌ని విమ‌ర్శించారు. అప్పుడు కుష్భూ కాంగ్రెస్ నాయ‌కురాలిగా ఉన్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అనేక మంది సోషల్ మీడియా యూజర్లు ఈ ట్వీట్ ను తమ ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు. దీనిపై గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ.. ఖుష్బూ సుందర్‌పై కేసు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు… అయితే ఈ ట్వీట్ పై ఖుష్బూ ఇంత వరకు స్పందించలేదు. అలాగే దానిని తొలగించలేదు. మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది, దీంతో ఆయన లోక్‌సభకు అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయం ప్రతిపక్ష పార్టీలను ఆగ్రహానికి గురి చేసింది. వారు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా ఖండించారు. గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనను ప్రకటించింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు వేయడాన్ని భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా తప్పుబట్టారు. ఇది గాంధీ తత్వానికి, భారతదేశపు లోతైన విలువలకు తీవ్ర ద్రోహం అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ చేసిన పాత ట్వీట్ వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement