ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ సంఘటన అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయిలు ఇద్దరూ జుట్టు పట్టుకుని మరీ వీర లెవల్ లో కొట్టుకున్నారు. తీరా వారు ఎందుకు కొట్టుకుంటున్నారని ఆరా తీయగా ఒక అబ్బాయికోసమని తెలిసి అక్కడ వున్నవారంతా ఆశ్చర్యపోయారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ అమ్మాయిలు, వారి బాయ్ ఫ్రెండ్ ని తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చదువుకుంటున్న పిల్లలే ఇలా తయారయితే ఎలా అంటూ బుద్దిచెప్పి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..