దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఎన్ఎస్ఈలో గత ఏడాది ఫిబ్రవరి 24న భారీ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏకంగా ఎక్స్ఛేంజీని 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని స్టాక్ ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకొచ్చాయి. నిఫ్టీ సహా మరికొన్ని ఇండెక్స్‌ల ధరలు సైతం తెరపై కనిపించలేదని పేర్కొన్నాయి. ఏడాది క్రితం కూడా ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. తాజా సమస్యతో మరోసారి ఎన్‌ఎస్‌ఈ వినియోగిస్తున్న సాంకేతికత, ఆటోమేషన్‌పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement