Thursday, November 21, 2024

వాజ్‌పేయి జయంతి సంద‌ర్భంగా.. ‘‘మైక్రో డొనేషన్’’ కార్య‌క్ర‌మాన్ని లాంచ్ చేసిన బీజేపీ..

మీరు అందించే చిన్న మొత్తాలే.. రేప‌టి దేశ భ‌విష్య‌త్తుకు పెద్ద బ‌లాన్ని అందిస్తాయ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాశ్ న‌డ్డా (జేపీ న‌డ్డా) అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఓ స‌రికొత్త ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసింది. “భారతదేశాన్ని నిరంత‌రం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంచేందుకు కృషి చేస్తున్న‌ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయడానికి ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాం” అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా శనివారం తెలిపారు.

ట్విటర్‌లో నడ్డా ఇలా అన్నారు, “ఈ రోజు డిసెంబర్ 25, అటల్ జీ జన్మదినం నుంచి ఫిబ్రవరి 11 వరకు అంటే దీన్ దయాళ్ జీ పుణ్య తిథి వరకు, బీజేపీ ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీనికి మీ మద్దతు అందించ‌డం ద్వారా పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంది. దీంతో దేశాన్ని ఎల్ల‌ప్పుడూ బెస్ట్ గా ఉంచ‌డంలో బీజేపీ కృషి చేస్తుంది” అన్నారు.

పార్టీ సూక్ష్మ విరాళాల కార్య‌క్ర‌మానికి తనవంతుగా సహకారాన్ని అందిస్తూ.. నడ్డా ఇలా అన్నారు, “Namo యాప్ ద్వారా ‘డొనేషన్’ మాడ్యూల్‌ని ఉపయోగించి BJPని బలోపేతం చేయడానికి నా సొంత ఫండ్స్‌ని అందించాను. రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి మీరు కూడా దీనికి డొనేష‌న్స్ చేయవచ్చు. ఈ సామూహిక ఉద్యమంలో మీతో పాటు మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా డొనేష‌న్స్ అందించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి బీజేపీకి స‌హ‌కారం అందించండి” అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement