కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్.. ఇప్పుడు 57 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికా, అమెరికా, యూకే, డెన్మార్క్, జింబాబ్వే, భారత్తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తం నేపథ్యంలో ఆయా దేశాలు అలర్ట్ అయ్యాయి. రిస్క్ ఉన్న దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.