Friday, November 22, 2024

ఒమిక్రాన్ ఫ‌స్ట్ ఫొటో .. రిలీజ్ చేసిన బాంబినో గెసో చిల్డ్ర‌న్స్ హాస్ప‌టల్ ..

క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని వైద్యులు ముందుగానే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ రోజులు రానే వ‌చ్చాయి. క‌రోనా కొత్త రూపం దాల్చింది.. దాని పేరే ఒమిక్రాన్.. ఇప్పుడు ఇదే పేరు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ వైర‌స్ ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ క‌న్స‌ర్న్ గా వెల్ల‌డించింది కూడా.. క‌రోనాని మించి మ‌హా డేంజ‌ర్ ఈ ఒమిక్రాన్ అని తెలియ‌జేశారు. కాగా రోమ్ లోని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బాంబినో గెసో చిల్డ్ర‌న్స్ ఆసుప‌త్రి వారు ఒమిక్రాన్ ఫ‌స్ట్ ఫొటోని రిలీజ్ చేశారు. అయితే ఈ ఫొటో ఒక మ్యాప్ రూపంలో ఉంది. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోల్చితే ఒమిక్రాన్ చాలా ప్ర‌మాద‌కారి. ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు మరింత ప్రమాదకరమైనవి రోమ్ పరిశోధకుల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు కారణమవుతాయంది.

అయితే, ఒమిక్రాన్ తో వ్యాప్తి ప్రభావం పెరుగుతోందా లేదా వ్యాక్లిన్ల ప్రభావం తగ్గుతుందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమ‌న్నారు ప‌రిశోధ‌కులు. కాగా డెల్టాతో సహా ఇతర వేరియంట్ లతో పోల్చితే ఒమిక్రాన్ మరింతగా వ్యాపించగలదా అనేది.. ఇంకా స్పష్టంగా తెలియదని డబ్ల్యూహెచ్ఓ వెల్ల‌డించింది . ఒమిక్రాన్.. ఇతర కోవిడ్ వేరియంట్ ల కంటే భిన్న లక్షణాలు ఉన్నాయడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదంది. ఒమిక్రాన్ పుణ్య‌మా అని ప‌లు దేశాలు లాక్ డౌన్ విధించేందుకు సిద్ద‌మ‌య్యాయి. ముందుగా ఈ వేరియంట్ ని సౌత్ ఆఫ్రికాలో గుర్తించారట‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement