ప్రభన్యూస్ : సామాన్య, మద్య తరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మిగిల్చిన చేదు అనుభవాలు ప్రజల మది నుంచి తొలగకముందే ఓమిక్రాన్ రూపంలో కొత్త వైరస్ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. రెండో వేవ్ అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు- ఎక్కువ వేగంగా కొత్త వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓమిక్రాన్ సోకిన వారికి బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. అంటే చికెన్ గున్యాకు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్. ఓమిక్రాన్ చంపదు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా మనోధైర్యంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా ఓమిక్రాన్ భారీ నుంచి కాపాడుకోవచ్చు.
ఓమిక్రాన్ కట్టడి చర్యల పేరుతొ ప్రజల భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ప్రతి రోజు కనీసం అరగంట ఎండలో నడిచి శరీరానికి డి విటమిన్ అందిచడం, తినే ఆహారం లో ప్రోటీ-న్ లు ఉండేలాచూసుకోవడం ద్వారా కొద్ద ఉపశమనం లభిస్తుంది. ఆదేవిధంగా పన్నీర్ , మొలికెత్తిన పెసల్లు, పుట్టగొడుగులు, జామ కాయ, చికెన్, ఫిష్, మటన్, గుడ్డు ప్రోటీ-న్ అందించే ఆహార పదార్థాలు తీసుకోవడం రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడంతో పాటు కనీసం వ్యాయమం ఉండేలా చూసుకోవడం ద్వారా ఈ వైరస్‌ను నిరోధించవచ్చు.
లాక్‌డౌన్ రోజులతో పోలిస్తే విద్యా, వ్యాపార, వాణిజ్య ఇతర కార్యకలాపాలు బాగా పెరిగాయి. ప్రజల దృష్టి కరోనా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం బాగా తగ్గించారు. నగరాల్లో ప్రతి 10 మందిలో 5-6 మంది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2-3 మంది మాత్రమే మాస్క్‌ను వినియోగిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని మాస్క్ ద్వారా అడ్డుకోవచ్చు. నోరు, ముక్కు రెండూ పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తేనే రక్షణగా ఉంటుంది. టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావంలేదని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి.. వారూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital