Tuesday, November 26, 2024

ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఇవే

క‌రోనాని మించిపోతోంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని 77దేశాల‌కి పాకింది. ఒమిక్రాన్‌ కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కాగా వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్నా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది కాగా ఓమిక్రాన్ సోకిన బాధితులకు రాత్రి సమయంలో చెమటలు పట్టేస్తున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అన్బెన్ పిళ్లే తెలిపారు. కొన్నిసార్లు బాధితుడికి చాలా చెమటలు పడతాయి. అతని బట్టలు లేదా మంచం కూడా తడిసిపోతుంది. సోకిన వారు చల్లని ప్రదేశంలో ఉన్నప్పటికీ చెమట పట్టవచ్చు. ఇది కాకుండా బాధితుడి శరీరంలో నొప్పులు ఉంటున్నాయని వెల్లడించారు.

ఓమిక్రాన్ సోకిన రోగిలో పొడి దగ్గు లక్షణాలు కూడా కనిపించాయని డాక్టర్ అన్బెన్ పిళ్లే చెప్పారు. ఈ లక్షణాలు ఇప్పటివరకు కరోనా బాధితుల్లో మాత్రమే కనిపించాయి. ఇది కాకుండా, జ్వరం, కండరాల నొప్పి కూడా ఒమిక్రాన్‌ లక్షణాలు కావచ్చన్నారు. దక్షిణాఫ్రికా వైద్యుడు ఏంజెలిక్ కోయెట్జీ, ఒమిక్రాన్ సోకిన వ్యక్తులలో గొంతు నొప్పికి బదులుగా గొంతు వాపు వంటి సమస్యను చూస్తారని పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉండవచ్చన్నారు. అయితే, గొంతు నొప్పి సమస్య మరింత బాధాకరంగా ఉంటుందన్నారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌న్నీ ఒమిక్రాన్ లోనూ ఉన్న‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement