Friday, November 22, 2024

ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు .. వివ‌రించిన డాక్ట‌ర్ ఏంజెలిక్ కోయెట్జీ ..

క‌రోనా త‌ర్వాత ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల‌ని ఒణికిస్తోంది. ఈ మేర‌కు ఒమిక్రాన్ ఫొటోలు కూడా విడుద‌ల చేశారు. దక్షిణాఫ్రికాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఓమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించిన అనేక అంశాలపై అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ 30 మ్యూటేషన్స్ కలిగి ఉన్నట్టుగా రిపోర్ట్ చెబుతున్నాయి. మ‌రి దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో వివ‌రించారు ద‌క్షిణాఫ్రికాకు చెందిన డాక్ట‌ర్ ఏంజెలిక్ కోయెట్జీ. కాగా ఈమె ద‌క్షిణాఫ్రికా మెడిక‌ల్ అసోషియేష‌న్ అధ్య‌క్షురాలే కాదు .. ఆ దేశ వ్యాక్సిన్ స‌భ్యురాలు కూడా.. పేషెంట్లలో కొత్త వేరియంట్‌ను అనుమానించిన వారిలో ఈమె కూడా ఉన్నారు. తన క్లినిక్‌లో డెల్టా వేరియంట్‌కు భిన్నమైన లక్షణాలను కలిగి ఉన్న ఏడుగురు రోగులను గమనించినట్లు కోయెట్జీ చెప్పారు. అయితే అవి చాలా తేలికపాటి లక్షణాలు అని చెప్పారు. అయితే అవి అసాధారణమైనవని అభిప్రాయపడ్డారు.

ఈ వేరియంట్ బారిన పడుతున్నవారిలో ఒకటి రెండు రోజులు తీవ్రమైన అలసట ఉంటుందని.. ఈ కారణంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నయని తెలిపారు. ఈ వేరియంట్ బారినపడ్డ వారిలో వాసన లేదా రుచి కోల్పోయినట్లు నివేదించలేదన్నారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా తగ్గుదల లేదని వివ‌రించారు. పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స చేయగులుగుతున్నామని వెల్లడించారు. ఈ వేరియంట్ 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తులను ప్రభావితం చేస్తున్నట్టుగా తాను ఇప్పటివరకు గమనించాన‌ని వివరించారు. .ఇంకా ఒమిక్రాన్ సోకిన వారు.. బొంగుర గొంతు, గొంతు నొప్పి గురించి ప్రధానంగా ఫిర్యాదు చేశారు. వారిలో విపరీతమైన అలసటను కనబరిచారు. అన్ని వయసుల వారిలో ఇది కనిపించింది. అయితే ఆక్సిజన్ స్థాయిలలో తీవ్రమైన తగ్గుదలని గుర్తించలేదు. వ్యాధి సోకిన చాలా మంది రోగులు ఆసుపత్రిలో చేరడంతో కోలుకున్నారు. వాసన లేదా రుచి కోల్పోయినట్టు వారు చెప్ప‌లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement