Wednesday, November 20, 2024

New Virus: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కలకలం.. ఒక్కరోజే 57 కేసులు

ఒక‌వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే.. మరోవైపు ఒమిక్రాన్ కి చెందిన‌ సబ్ వేరియంట్లు బయటపడటం జ‌నాల‌ను మ‌రింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి సంబంధించి గుజరాత్​లో 3 సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. ఈ స‌బ్ వేరియంట్ల‌తో ఒక్కరోజే 41 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. బీఏ1, బీఏ2, బీఏ3 వేరియంట్ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. వీటి వల్ల ఇప్పటికే బ్రిటన్ ​లో కేసులు పెరుగుతున్నాయి.

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లోనూ ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 16 మందిలో ఈ వైరస్​ను గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాల తీవ్రతపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని చెబుతుంటే, మరికొందరు ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ ప్రమాదకరమైనదేనని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement