క్రిస్మస్ పండుగ వేళ చాలా మంది టూర్లు వెళ్తుంటారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే ఉందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ తెలిపారు. అసాధారణరీతిలో ఒమిక్రాన్ వ్యాపిస్తున్నట్లు చెప్పడానికి సందేహించడం లేదని ఆయన అన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి వేళ అమెరికా ప్రభుత్వానికి ఆంథోనీ ఫౌసీ దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తే అది దేశ ఆరోగ్యసేవలపై పెను ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే హాస్పిటళ్లపై మరింత ప్రెషర్ పెరుగుతందన్నారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులు తీసుకోవాలని కోరారు.