Tuesday, November 26, 2024

Omicron: రెండు వారాల్లో 59 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇతర దేశాలనూ వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తించింది. ఇప్పటి వరకు మొత్తం 2, 936 మందికి ఒమిక్రాన్‌ సోకింది. ఇది కాకుండా 78,054 కరోనా సోకిన బాధితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ పై జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది.

ఇన్‌ఫెక్షన్‌ల లక్షణాలు ఇప్పటివరకు స్వల్పంగానే ఉన్నప్పటికీ, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను అతలాకుతలం చేసే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

UK, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో అధిక కేసులు నమోదయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో కేసులు పెరుగుతాయని తాము భావిస్తున్నామని అశోకా విశ్వవిద్యాలయంలోని త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ షాహిద్ జమీల్, అశోకా యూనివర్సిటీ ఫిజిక్స్ అండ్ బయాలజీ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ తెలిపారు. కొత్త వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని నిపుణులు ఇద్దరూ పిలుపునిచ్చారు. వీటికి బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement