Friday, November 22, 2024

ఒమిక్రాన్ సైలెంట్ కిల్ల‌ర్ : సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

ఒమిక్రాన్ పై సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ విచారణలను చేపట్టిన సుప్రీంకోర్టు.. మహమ్మారి తగ్గడంతో పాక్షికంగా భౌతిక విచారణలు నిర్వహిస్తోంది. ప్రతి బుధవారం, గురువారం భౌతిక విచారణ జరుపుతోంది. అయితే పూర్తిస్థాయిలో భౌతిక విచారణలను పునఃప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తాజాగా విజ్ఞ‌ప్తి చేసింది. బారో అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. ఒమిక్రాన్ వేరియంట్ చాలా స్వల్పమైందని ప్రస్తుతం రోజువారీ కేసులు 15 వేలకు చేరాయని అన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ఒమిక్రాన్ తేలికైంది కాదని, నా అనుభవపూర్వకంగా చెబుతున్నానని చెప్పారు.

‘‘మీకు తెలుసా ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్… నేను ఫస్ట్ వేవ్‌లో కరోనాతో నాలుగు రోజులు మాత్రమే ఇబ్బంది పడి కోలుకున్నాను.. కానీ, ప్రస్తుతం ఒమిక్రాన్ వేవ్‌లో కరోనా బారినపడి 25 రోజులు గడిచినా ఇంకా బాధపడుతూనే ఉన్నాను.. పూర్తిస్థాయి భౌతిక విచారణ గురించి వేచిచూద్దాం’’ అని వ్యాఖ్యానించారు. దీనికి న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మీ విషయంలో అలా జరగడం దురదృష్టకరం. కానీ ప్రజలు వేగంగానే కోలుకుంటున్నారు’’ అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement