ఇప్పటికే పలు దేశాల్లో ఓమిక్రాన్ కలకలం రేగుతోంది. ఇండియాలో థర్డ్ వేవ్ ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ ఓమిక్రాన్ హల్ చల్ చేస్తుంది. దాంతో కరోనా కంటే అతి ప్రమాదకరమైనదని డబ్ల్యూ హెచ్ ఓ వెల్లడించింది. పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమలు చేస్తున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓమిక్రాన్‌పై అలర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది. గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పేలా లేదు. అంంతేకాదు పబ్‌లు, మాల్స్, థియేటర్లపై నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం . అంతేగాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చేవారు ఖచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించడం వంటి చర్యలు చేపట్టనున్నారట.
ఓమిక్రాన్ కల కలం.. పబ్ లు .. మాల్స్ .. థియేటర్స్ పై ఆంక్షలు తప్పవా..
Advertisement
తాజా వార్తలు
Advertisement