నిన్న బెంగళూరులో రెండు ఓమిక్రాన్ కేసులు గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడు ఓ హోటల్ దిగాడు. అతడికి కరోనా పరీక్షల్లో కొవిడ్ టెస్ట్ లో కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దాంతో హోటల్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. అతడు అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్నట్టు బెంగళూరు మునిసిపల్ అధికారులు వివరించారు. కాగా ఒమిక్రాన్ రోగిగా గుర్తించిన 66 ఏళ్ల వ్యక్తి అర్ధరాత్రి వేళ దుబాయ్ చెక్కేయడం కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో అతడు కొవిడ్ నెగటివ్ రిపోర్టుతోనే ఫ్లైట్ ఎక్కినట్టు గుర్తించారు. అయితే, బెంగళూరులో మాత్రం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా వైరస్ సోకినప్పటికీ అతడిలో లక్షణాలు లేవని గుర్తించిన వైద్యులు.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మరోవైపు, అప్పటికే ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఎందుకైనా మంచిదని నవంబరు 22న అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగుకు పంపారు.
ఆ నివేదికలు రాకముందే బాధితుడు ఓ ప్రైవేటు ల్యాబ్‌ను సందర్శించి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ అతడికి నెగటివ్‌గా తేలింది. ఇంకోవైపు, అతడి ప్రైమరీ కాంటాక్ట్‌లు అయిన 24 మంది వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. అదే నెల 22, 23 తేదీల్లో బాధితుడి సెకండరీ కాంటాక్ట్‌లు అయిన 240 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా, వారికి కూడా కరోనా సోకలేదని నిర్ధారణ అయింది.మరి దుబాయ్ వెళ్లిన రోగి వల్ల ఎంతమంది ఓమిక్రాన్ వ్యాపిస్తుందోనని అధికారులు కంగారుపడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..