కరోనా ఒకపక్క , ఒమిక్రాన్ మరోపక్క ప్రజలను ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్ తన పెళ్ళిని వాయిదా వేసుకున్నారు. వివాహం తిరిగి ఎప్పుడు చేసుకుంటామనేది చెప్పలేదు. ఇక పెళ్ళిని రద్దు చేసుకోవడం పట్ల ఆయన స్పందన ఏంటని ప్రశ్నించింది మీడియా. ..జీవితం అంటే అదే మనం ఊహించనివి జరుగుతుంటాయని సమాధానం ఇచ్చారు జెసిండా. దీర్ఘకాల భాగస్వామి, ఫిషింగ్ షో హోస్ట్ క్లార్క్ గేఫోర్డ్‌ను జెసిండా వివాహం చేసుకోబోతున్నారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సామాజిక వ్యాప్తి పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా మాస్క్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే, ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించింది. నేటి అర్ధరాత్రి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. ఉత్తర ద్వీపంలోని ఆక్లాండ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ కుటుంబం దక్షిణ ద్వీపంలోని నెల్సన్‌కు విమానంలో వచ్చింది. ఈ కుటుంబంతోపాటు ఫ్లైట్ అటెండెంట్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. కొవిడ్-19 ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పుడు ‘రెడ్ సెట్టింగ్స్’లోకి వెళ్లిపోతుంది. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బార్‌లు, రెస్టారెంట్లు, వివాహాలు వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరు కావడానికి వీల్లేదు. ఈ వేదికల్లో వ్యాక్సినేషన్ పాస్‌లను ఉపయోగించకుంటే కనుక ఆ సంఖ్య 25కు పరిమితం అవుతుందని ప్రధాని జెసిండా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..