ప్రపంచదేశాల్ని కుదిపేస్తున్నాయి ఓమిక్రాన్ కేసులు. ఈ మేరకు ఇజ్రాయిల్ దేశం తన సరిహద్దులను మూసివేసింది. విదేశీయులు ఎవ్వరూ ఇజ్రాయిల్ రాకుండా కట్టడి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. కాగా బ్రిటన్ కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ ని ఖచ్చితంగా చేయించాలనే నిబంధలని అమలులోకి తెచ్చింది. మరోవైపు ప్రపంచంలోని అన్నిదేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా, బోట్స్ వానా, నమీబియా, జింబాంబ్వే, హాంకాంగ్ దేశాల నుంచి ప్రయాణికులు రాకుండా ఇతర దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement