Tuesday, November 19, 2024

Tedros: ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దు: WHO హెచ్చరిక

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్.. 120పైగా దేశాలకు విస్తరించింది. అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక  వ్యాఖ్యలు చేసింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి అని, దానిని తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ హెచ్చరించారు. డెల్టా కంటే ఓమిక్రాన్ ప్రమాదకరమైన వైరస్‌ని తెలిపారు. కరోనా టీకా తీసుకోని వారికి దానితో ముప్పు ఎక్కువని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్రభావం తగ్గిపోతోందని, డెల్టాను ఒమిక్రాన్ అధిగమించేస్తోందని చెప్పారు.

ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి 70 శాతం మందికి టీకాలు వేసే లక్ష్యాన్ని అన్ని దేశాలూ చేరుకోవాల్సిన అవసరం ఉందని WHO చీఫ్ సూచించారు. ఇప్పటివరకు ప్రపంచ జనాభాలో 50 శాతం మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్‌లు పొందారని తెలిపారు. 9 శాతం మంది పాక్షికంగా వ్యాక్సిన్‌లు పొందారని, 41 శాతం మంది ఇప్పటికీ టీకాలు వేయలేదని వివరించారు. ఇప్పటిదాకా 90 దేశాల్లో 40 శాతమే వ్యాక్సినేషన్ జరిగిందని, అందులోని 36 దేశాల్లో కనీసం 10 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న వ్యాక్సిన్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ఫస్ట్, సెకండ్ డోసులుగా ఇచ్చిన వ్యాక్సిన్ నే బూస్టర్ డోసుగా వేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement