ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఓమిక్రాన్.. ఈ నేపథ్యంలో షేర్ మార్కెట్స్ భారీగా పడిపోయాయి. భారత్ లోకి కూడా ఈ ఒమిక్రాన్ కేసులు ఎంటరవ్వడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. . దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 764 పాయింట్లు కోల్పోయి 57,696కి పడిపోయింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 17,196కు దిగజారింది. ఎల్ అండ్ టీ (0.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.61%), టాటా స్టీల్ (0.47%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.35%) టాప్ గ్రెయినర్స్ గా నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.03%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.05%), ఏసియన్ పెయింట్స్ (-2.29%), భారతి ఎయిర్ టెల్ (-1.88%), టెక్ మహీంద్రా (-1.81%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement