Wednesday, November 20, 2024

ఒమిక్రాన్‌ జీవిత కాలం ఎక్కువే.. దక్షిణాఫ్రికాలో ఫోర్త్​ వేవ్​…

ప్ర‌భ‌న్యూస్ : దక్షిణాఫ్రికాను ఒమిక్రాన్‌ వెంటాడుతోంది. రోజువారీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. నాల్గో వేవ్‌ ప్రారంభమైంది. మూడు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ప్రతీ నలుగురిలో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా స్పందించారు. ద.ఆఫ్రికాలో నాల్గో వేవ్‌ ప్రారంభమైందన్నారు. ఊహించిందే జరుగుతోందని తెలిపారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకుని.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. వారం రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయని, ఈ సంఖ్య 5 రెట్లకు పెరిగిందని వివరించారు. రెండు వారాల క్రితం పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి చేరుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

దక్షిణాఫ్రికాతో పాటు యూరప్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ బారినపడే వారిలో ఎక్కువ మంది యువకులు ఉంటున్నారు. రెండు టీకాలు తీసుకున్న వారు కూడా ఒమిక్రాన్‌ బారినపడ్డారు. వృద్ధుల కంటే యువకులు బలమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నా.. ఒమిక్రాన్‌ వదిలిపెట్టడం లేదు. దక్షిణాఫ్రికాలో మొదటి కేసు వెలుగుచూసిన కేవలం 10 రోజుల్లోనే సుమారు 40కు పైగా దేశాలకు వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదుకాకపోవడం ఊరట కలిగించే అంశం. తేలికపాటి లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందడంతోనే ప్రతీ ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు నమోదైన అన్ని దేశాల్లో బాధితులు స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నట్టు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ తెలియజేసింది. ఒమిక్రాన్‌ తేలికపాటి రూపాంతరం అంటే.. జలబులా.. వేగంగా వ్యాప్తి చెందగల సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement