Friday, November 22, 2024

ఓమిక్రాన్ భ‌యం ..త‌గ్గుముఖం ప‌డుతోన్న బంగారం ధ‌ర‌లు ..

ఓమిక్రాన్ భ‌యాల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. శుక్ర‌వారం బంగారం ధ‌రలు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,750 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈరోజు కూడా బంగారం భారీగా పతనమైంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,580 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,580 గా ఉంది. హైదరాబాద్ బంగారం ధరల్లో మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో శుక్రవారం 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,650గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 44,600 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement