Tuesday, November 26, 2024

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రూల్స్ మరింత స్ట్రిక్ట్.. ఈ రెండ్రోజులు జాగ్రత్తగా ఉండాలే..

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా అన్ని సిటీలలో రూల్స్ ని మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేసింది. అన్ని ప్రధాన నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధించాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. ఈ మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రదేశాలు, రెస్టారెంట్లు, బార్ లు, పబ్ ల కు సంబంధించి కస్టమర్లు రూల్స్ పాటించేలా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. మార్కెట్లు, మతపరమైన ప్రదేశాలు, సెలవు రోజుల్లో రద్దీని అదుపు చేయడం కష్టంగా ఉందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. గత 24 గంటల్లో దేశంలో 13,154 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 268 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సిటీల నుంచి పట్టణాలకు వ్యాపిస్తోంది. అక్టోబర్ తర్వాత రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది.

ముంబైలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మేలో నమోదైన కేసులతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 2,510 మందికి వైరస్ సోకింది. దీన్ని అదుపు చేయడానికి పోలీసులు జనవరి 7వ తేదీ వరకు ఆంక్షలు విధించారు. అయిదు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని ఆంక్షలు పెట్టారు. రూల్స్ అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.

‘‘రూల్స్ ని పాటించకుండా ఇష్టమున్నట్టు జనాలు వ్యవహరించడం వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోందని, దాన్ని కంట్రోల్ చేయడానికి జనాలు గుమిగూడకుండా చూడడమే తమకు ఏకైక మార్గంగా ఉందన్నారు మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే. మా వంతు ప్రయత్నాలను సీరియస్ గానే చేస్తున్నాం, ప్రజలు కూడా తమకు సహకరించాలి‘‘ అని కోరారు. కేసుల పెరుగుల నివారించడానికి రాబోయే 48 గంటలు చాలా కీలకమని, ప్రజలు సంయమనం పాటించి నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే జరుపుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement